పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి మరింత సమాచారం అవసరమని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ శుక్రవారం పేర్కొన్నారు. గర్భిణులకు మాత్రం టీకాలు వేయొచ్చని స్పష్టం చేశారు. ఇందుకుగానూ కేంద్ర, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసినట్లు చెప్పారు.
పసిపిల్లలకు మాత్రం టీకా వేయాలా? వద్దా? అనే అంశం ప్రశ్నార్థకంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
'' ప్రస్తుతం అమెరికా మాత్రమే పిల్లలకు టీకాలు వేస్తోంది. అక్కడ కూడా కొన్ని సంక్లిష్టతలు కనిపించాయి. కాగా.. పసిపిల్లలకు టీకా అవసరమవుతుందా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. 2-18 ఏళ్ల వయసువారికి టీకాలు వేసే విషయమై అధ్యయనాన్ని ప్రారంభించాం. ఆ ఫలితాలు సెప్టెంబర్-అక్టోబర్ కల్లా వచ్చే అవకాశముంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు.''
- డా. బలరాం భార్గవ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్.
పిల్లలకు టీకాలు వేసే అంశంపై అంతర్జాతీయంగా వైద్య నిపుణులు.. ఇంకా ప్రయోగాలు జరుపుతున్నారని తెలిపారు ఐసీఎంఆర్ చీఫ్.
ఇదీ చదవండి: Covaxin: సెప్టెంబర్ నుంచి పిల్లలకు కొవాగ్జిన్..!