తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవిడ్ టీకా పూర్తి రక్షణ ఇవ్వకపోవచ్చు.. కానీ' - సౌమ్య స్వామినాథన్​

కరోనా టీకా.. వైరస్ నుంచి సంపూర్ణ రక్షణ ఇవ్వకపోవచ్చునని.. అయితే వ్యాధి తీవ్రత, మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రధాన సౌమ్య స్వామినాథన్. విస్తృత కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

Soumya Swaminathan
సౌమ్య స్వామినాథన్

By

Published : Aug 13, 2021, 6:44 AM IST

కరోనా టీకా.. విభిన్న కొవిడ్​ వేరియంట్ల నుంచి పూర్తిగా రక్షణ కల్పించకపోవచ్చు.. కానీ వ్యాధి తీవ్రత, మరణ ప్రమాదాలను కచ్చితంగా తగ్గిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రధాన సౌమ్య స్వామినాథన్ తెలిపారు. విస్తృత కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌తో జరిగిన సమావేశంలో.. దేశంలోని ప్రస్తుత కొవిడ్​ పరిస్థితి సహా పలు అంశాలపై చర్చించారు.

ఈ క్రమంలోనే విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు ఉన్న భారత్​లో భారీ వ్యాక్సిన్ డ్రైవ్‌ నిర్వహించడం అంత సులభం కాదని జితేంద్ర సింగ్​ పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్​ శక్తి సామర్థ్యాలు మరింత పెరిగాయన్నారు. వనరుల కొరత ఉన్నప్పటికీ.. ఏడాదిలో గణనీయంగానే టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్​ అందించే స్థితిలో ఉన్నట్లు సింగ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మిజోరంలో 128 మంది చిన్నారులకు కరోనా.. కేరళలో..

ABOUT THE AUTHOR

...view details