తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంటులో కరోనా కలకలం.. ఆ ఎంపీకి పాజిటివ్​ - లోక్​సభలో కరోనా

Covid In Parliament: సోమవారం వరకు లోక్‌సభకు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్‌ దానిష్‌ అలీ కరోనా బారినపడ్డారు. తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Covid In Parliament:
ఎంపీకి కరోనా

By

Published : Dec 21, 2021, 4:34 PM IST

Covid In Parliament: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ ఓ ఎంపీ కరోనా బారినపడ్డారు. నిన్నటి వరకు(డిసెంబర్​ 20) లోక్‌సభకు హాజరైన తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు బీఎస్పీ ఎంపీ కున్వార్‌ దానిష్‌ అలీ వెల్లడించారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్నప్పటికీ వైరస్‌ సోకిందని ట్వీట్‌ చేశారు. తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎంపీ దానిష్ అలీ ట్వీట్​

"టీకా రెండు డోసులు వేయించుకున్నప్పటికీ ఈరోజు నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. నిన్న కూడా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యాను. నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండి. స్వీయ నిర్బంధంలో ఉండండి. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. త్వరలోనే కోలుకుంటానని భావిస్తున్నా."

-కున్వార్​ దానిష్‌ అలీ, బీఎస్పీ ఎంపీ

Mp Covid Positive: తన ట్వీట్‌ను లోక్‌సభ స్పీకర్‌, లోక్‌సభ సెక్రటేరియట్‌కు దానిష్​ ట్యాగ్‌ చేశారు.

ఇదీ చూడండి:Omicron Cases in India: దేశంలో 200 దాటిన ఒమిక్రాన్​ కేసులు

ఇదీ చూడండి :బూస్టర్‌ డోసుగా ముక్కుద్వారా తీసుకునే టీకా..!

ABOUT THE AUTHOR

...view details