దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కొవిడ్-19 నిబంధనలపై దృష్టి సారించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా తెలిపారు.
'రానున్న హోలీ, షాబ్-ఈ-బరత్, బిహూ, ఈస్టర్, ఈద్-ఉల్-ఫితర్.. పండుగల దృష్ట్యా జాతీయ విపత్తు నిర్వాహణ చట్టం-2005 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్థానికంగా కఠిన నిబంధనలు విధించుకోవచ్చు' అని రాష్ట్రాలకు పంపిన లేఖలో కేంద్రం పేర్కొంది.