తెలంగాణ

telangana

దేశంలో కొత్తగా 2.40 లక్షల కేసులు- 3,741 మరణాలు

By

Published : May 23, 2021, 9:28 AM IST

Updated : May 23, 2021, 10:06 AM IST

దేశంలో కరోనా మరణాలు నాలుగు వేల లోపునకు పడిపోయాయి. శనివారం మరో 3,741 మంది మరణించారు. కొత్తగా 2.40 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి.

COVID CASES INDIA
కరోనా కేసులు భారత్

కొవిడ్ నుంచి స్వల్ప ఊరట కలిగే వార్త! దేశంలో రోజువారి మరణాల సంఖ్య నాలుగు వేల లోపునకు పరిమితమైంది. గడిచిన రెండు రోజులుగా 4 వేలకు పైగా మృత్యువాత పడుతుండగా.. శనివారం 3,741 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:ఆ నాలుగు వర్గాలు టీకా ఎప్పుడు వేసుకోవాలంటే?

మరోవైపు కొత్త కేసుల సంఖ్య రెండున్నర లక్షల లోపునకు పరిమితమైంది. 2,40,842‬ మందికి శనివారం కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 65లక్షలు దాటింది.

  • మొత్తం కేసులు: 2,65,30,132‬
  • మొత్తం మరణాలు: 2,99,266
  • రికవరీలు: 2,34,25,467
  • యాక్టివ్ కేసులు: 28,05,399

ఇదీ చదవండి:జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?

పరీక్షలు

శనివారం 20 లక్షలకు పైగా కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. మొత్తం 21,23,782నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 32,86,07,937కి చేరింది.

ఇదీ చదవండి:కేటాయింపు రూ.35వేల కోట్లు- ఖర్చు రూ.4.7వేల కోట్లు

వ్యాక్సినేషన్

మరోవైపు, శనివారం 16,04,542 మందికి కరోనా టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 19.50 కోట్లు దాటింది.

ఇదీ చదవండి:టీకా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Last Updated : May 23, 2021, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details