దేశంలో కరోనా వ్యాప్తి(corona cases in India) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేరళలో కొత్తగా 12,469 కేసులు నమోదయ్యాయి. 88మంది ప్రాణాలు కోల్పోయారు. 13,614 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 1,08,560 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Covid cases: కర్ణాటకలో 5,983.. దిల్లీలో 158 - కేరళలో కొవిడ్ కేసులు
దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా కేరళలో 12,469 కేసులు, తమిళనాడులో 9,118 కేసులు నమోదయ్యాయి.
కేరళలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
వివిధ రాష్టాల్లో ఇలా..
- దిల్లీ(Delhi covid cases)లో 158 కొత్త కేసులు నమోదు కాగా, 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 343 మంది కోలుకున్నారు.
- కర్ణాటకలో కొత్తగా 5,983 కేసులు నమోదయ్యాయి. 10,685 మంది కోలుకోగా 138 మంది మృతి చెందారు.
- తమిళనాడులో కొత్తగా 9,118 కేసులు నమోదయ్యాయి. 22,720 రికవరీ కాగా 210 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో కొత్తగా 9830 కేసులు బయటపడ్డాయి. 5890 మంది డిశ్చార్జి కాగా 236 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి :'పిల్లల్లో కరోనా'పై కేంద్రం మార్గదర్శకాలు
Last Updated : Jun 17, 2021, 10:45 PM IST