Corona cases in India: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో.. 2,34,281 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. మరణాల సంఖ్య పెరిగింది. వైరస్‌తో మరో 893 మంది మరణించారు. 3,52,784 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:4,10,92,522
- మొత్తం మరణాలు: 4,94,091
- యాక్టివ్ కేసులు:18,84,937
- మొత్తం కోలుకున్నవారు:3,87,13,494
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 62,22,682 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,70,60,692కు చేరింది.
దేశంలోని అర్హులైన వారిలో ఇప్పటివరకు 75శాతం మందికి రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
" దేశంలో అర్హులైన 75 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ విజయానికి చేరువైనందుకు భారత ప్రజలకు శుభాకాంక్షలు. వ్యాకిన్ డ్రైవ్‌ను విజయవంతం చేసినవారిని చూస్తుంటే గర్వంగా ఉంది."
-- ప్రధాని నరేంద్రమోదీ
అంతర్జాతీయంగా..
Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 26,53,676 మందికి కరోనా సోకింది. 7,671 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 3,72,924,584కు చేరగా.. మరణాల సంఖ్య 56,75,413కుపెరిగింది.
- US Corona Cases: అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా1,92,028మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 1,127 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య75,481,122కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే332,398కేసులు వెలుగుచూశాయి. మరో 178 మంది చనిపోయారు.
- ఇటలీలో94,783 కొత్త కేసులు బయటపడగా..174 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 207,316మందికి వైరస్ సోకగా.. 695మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 41,978 కరోనా కేసులు బయటపడగా.. 179 మంది బలయ్యారు.
- జర్మనీలో 1,43,518వేల మందికి వైరస్ సోకింది. మరో 91 మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో మరో 72,727వేల మంది వైరస్ బారిన పడ్డారు. 296 మంది మృతి చెందారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:New Virus India: నియోకొవ్ వైరస్‌తో భారత్‌కు ముప్పు ఉందా?