Corona cases in India: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో.. 2,35,532 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. మరణాల సంఖ్య పెరిగింది. వైరస్‌తో మరో 871 మంది మరణించారు. 3,35,939 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:4,08,58,241
- మొత్తం మరణాలు:4,93,198
- యాక్టివ్ కేసులు:20,04,333
- మొత్తం కోలుకున్నవారు:3,83,60,710
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 56,72,766 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,04,87,260కు చేరింది.
అంతర్జాతీయంగా..
Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 3,408,113మందికి కరోనా సోకింది. 10,324 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 370,189,281కి చేరగా.. మరణాల సంఖ్య 5,667,427కు పెరిగింది.
- US Corona Cases: అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా522,300మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 2,732 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య75,271,402కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే353,503కేసులు వెలుగుచూశాయి. మరో 263మంది చనిపోయారు.
- ఇటలీలో 143,898కొత్త కేసులు బయటపడగా.. 378మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 257,239మందికి వైరస్ సోకగా.. 779మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 63,884 కరోనా కేసులు బయటపడగా.. 305మంది బలయ్యారు.
- జర్మనీలో 189,464వేల మందికి వైరస్ సోకింది. మరో 179మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో మరో 89,176వేల మంది వైరస్ బారిన పడ్డారు. 277మంది మృతి చెందారు.
- స్పెయిన్‌లో తాజాగా 118,922 కేసులు బయటపడ్డాయి. మరో 199 మంది మరణించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక సూచనలు