తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 50వేల కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

Covid cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా 50,407 మందికి వైరస్​ సోకింది. మరో 804 మంది మరణించారు. 1,36,962 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

COVID
కొవిడ్

By

Published : Feb 12, 2022, 9:29 AM IST

Corona cases in India: భారత్​లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 50,407 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 804 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,36,962 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు:4,25,86,544
  • మొత్తం మరణాలు:5,07,981
  • యాక్టివ్ కేసులు:6,10,443
  • మొత్తం కోలుకున్నవారు:4,14,68,120

దేశంలో కొత్తగా 46,82,662 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,29,47,688 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World Corona Cases

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 23 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 10,927 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 40.86 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 58,19,705కు చేరింది.

  • జర్మనీలో మరో 2.29 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 215 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో ఒక్కరోజే 2 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 722 మంది మృతిచెందారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1.66 లక్షల మందికి కరోనా సోకింది. 1,121 మంది మరణించారు.
  • అమెరికాలో తాజాగా 1.49 లక్షల కేసులు బయటపడగా.. 1,917 మంది బలయ్యారు.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 1.31 లక్షల మంది మందికి వైరస్ సోకింది. మరో 329 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి :

'స్కూళ్లలో బుర్ఖాలు, హిజాబ్​లు వద్దు.. మోదీజీ చొరవ చూపండి!'

రోడ్డుపై రిటైర్డ్ కలెక్టర్ కుమారుడు వీరంగం.. యువకుడ్ని ఢీకొట్టి..

ABOUT THE AUTHOR

...view details