తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిలో విజృంభిస్తున్న కరోనా.. మహారాష్ట్రలో 40 వేల కేసులు

Covid Cases in India: ముంబయిలో కరోనా కేసుల సంఖ్య మరోసారి 20వేలు దాటింది. ఒక్కరోజే 20,318 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 8,906 మందికి కొవిడ్​ సోకగా.. కేరళలో 5,944 కేసులు వెలుగు చూశాయి.

Covid Cases in India
కరోనా కేసులు

By

Published : Jan 8, 2022, 8:36 PM IST

Updated : Jan 8, 2022, 9:32 PM IST

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా భారీగా కరోనా కేసులు బయటపడుతున్న మహారాష్ట్రలో కొత్తగా 41,434 కేసులు బయటపడ్డాయి. 9,671 మంది కోలుకోగా 13 మంది మృతిచెందారు. ఒక్క ముంబయిలోనే 20,318 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని యాక్టివ్​ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ముంబయిలోని ధారావిలో కొత్తగా 147 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రాంతంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 729కి చేరింది.

మరోవైపు రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్​ కేసులు 1009కి చేరాయి. జనవరి 10 వరకు మహారాష్ట్రలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నలుగురికి మించి ఎక్కువమంది కలిసి సంచరించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్​ సెంటర్లను ఫిబ్రవరి 15 వరకు మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. స్విమ్మింగ్​ పూల్స్​, జిమ్స్​, స్పాలు, బ్యూటీ సెలూన్​లు, మ్యూజియాలు, ఎంటర్టైన్​మెంట్​ జోన్లను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. సెలూన్లు మాత్రం 50 శాతం మందితో నడుపుకోవచ్చని తెలిపింది.

  • ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మొత్తం 235 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్​ అని తేలింది.
  • దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 20,181 వైరస్​ కేసులు నమోదు అయ్యాయి. ఏడుగురు చనిపోయారు. పాజిటివిటీ రేటు 19.60 శాతానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
  • బంగాల్​లో కొత్తగా 18,802 కేసులు నమోదు అయ్యాయి. 8,112 మంది రికవరీ అయ్యారు. 19 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య 62,055 ఉంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 29.6 శాతంగా నమోదు అయ్యింది.
  • కర్ణాటకలో మొత్తం 8,906 కొత్త వైరస్​ కేసులు వెలుగు చూశాయి. 508 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. నలుగురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 38,366కు చేరింది. 38 వేలకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • బెంగళూరులో పాజిటివిటీ రేటు పది శాతానికి పైగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. నగరంలో కొత్తగా 7,113 కేసులు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు.
  • కేరళలో ఒక్కరోజే 5,944 కేసులు నిర్ధరణ అయ్యాయి. 2,463 మంది రికవరీ అయ్యారు. మరో 33 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 31,098గా ఉంది. 49,547 మంది వైరస్​ కారణంగా చనిపోయారు.
  • పుణెలో మరో 60 మంది పోలీసులు వైరస్​ బారిన పడ్డారు. దీంతో శాఖలో మొత్తం కేసుల సంఖ్య 185కు చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 27 మంది ఉన్నతాధికారులు కాగా.. మరో 158 మంది సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు.
  • ఉత్తరాఖండ్​లో వైరస్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని జనవరి 15 వరకు రాజకీయ, మత, సామాజిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామీ తెలిపారు. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
  • గుజరాత్​లో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. అత్యధికంగా అహ్మదాబాద్, సూరత్ నగరంలో కొవిడ్​ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని మెట్రో నగరాల్లో ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది.
  • పెరుగుతున్న కేసులు వలస కార్మికుల్లో ఆందోళన కలగజేశాయి. దీంతో చాలా మంది వలస కూలీలు సొంతూళ్ల బాట పట్టారు. పెద్ద సంఖ్యలో కార్మికులు సూరత్ రైల్వే స్టేషన్‌కు తరలివస్తున్నారు.
    సూరత్​ స్టేషన్​లో వలస కార్మికులు
    సొంతూళ్లకు పయనం అయిన వలస కార్మికులు
    సూరత్​ రైల్వే స్టేషన్​లో వలస కార్మికులు
  • గుజరాత్​లో కొత్తగా 32 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 236కి చేరింది.

ఇదీ చూడండి:భారీగా మంచు కురుస్తున్నా.. గర్భిణీని భుజాలపై మోసుకెళ్లిన సైనికులు

Last Updated : Jan 8, 2022, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details