తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- 7 వేల దిగువకు.. - ప్రపంచలో కరోనా కేసులు

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 6,915 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మరో 180 మంది మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 11,01,750 కేసులు వెలుగుచూశాయి.

covid cases in india
కొవిడ్​ కేసులు

By

Published : Mar 1, 2022, 9:25 AM IST

Updated : Mar 1, 2022, 10:04 AM IST

Corona cases in India: దేశంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 6,915 మందికి మహమ్మారి సోకగా.. 16,864 మంది కోలుకున్నారు. 180 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 92,472గా ఉంది.

  • మొత్తం కేసులు: 4,29,31,045
  • మొత్తం మరణాలు: 5,14,023
  • యాక్టివ్​ కేసులు: 92,472
  • కోలుకున్నవారు: 4,23,24,550

Vaccination in india:

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సోమవారం మరో 18,22,513 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,77,70,25,914కు చేరింది.

World Corona cases:

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 11,01,750 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 43,70,89,748కి.. మరణాలు 59,75,048కి చేరుకున్నాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్ దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • జర్మనీలో కొత్తగా 95,396 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 118 మంది కరోనాకు బలయ్యారు.
  • అమెరికాలో కొత్తగా 32,918 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 710 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో తాజాగా 1,06,920 కరోనా కేసులు నమోదయ్యాయి. 733 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 248 మంది చనిపోయారు. 19,516 కేసులు వెలుగుచూశాయి.
  • ఫ్రాన్స్​లో కరోనా మహమ్మారి ధాటికి మరో 232 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 13,483 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి :'కఠిన సవాళ్లు వస్తున్నాయ్​.. భారత్​ మరింత శక్తిమంతం కావాలి'

Last Updated : Mar 1, 2022, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details