తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా.. 32వేల పైనే యాక్టివ్ కేసులు

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,357 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకడం వల్ల ఒక్క రోజులోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

covid cases in india
covid cases in india

By

Published : Apr 9, 2023, 10:26 AM IST

Updated : Apr 9, 2023, 10:43 AM IST

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,357 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకడం వల్ల ఒక్క రోజులోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారంతో పోలిస్తే 798 కేసులు తగ్గాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 32,814కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

  • దేశంలో కొత్తగా 5,537 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • కొవిడ్ వైరస్ వల్ల మరో 11 మరణించారు.
  • గుజరాత్​లో ఇద్దరు, హిమాచల్​ ప్రదేశ్​, బిహార్​, ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్​ ప్రదేశ్​లో ఒక్కొక్కరు మరణించారు.
  • ఇప్పటి వరకు కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 5,30,965కు చేరింది.
  • దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరింది.
  • కరోనా మహామ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,47,56,616 మందికి కొవిడ్​ సోకింది.
  • ఇప్పటి వరకు 4,41,92,837 మంది రికవరీ అయ్యారు. రికవరీ రేట్​ 98.74 శాతంగా ఉంది.
  • ఇప్పటివరకు 220.66(220,66,22,663) కోట్ల కొవిడ్​ టీకాలు పంపిణీ చేశారు.

అంతకుముందు రోజు దేశవ్యాప్తంగా కొత్తగా 6,155 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకడం వల్ల ఒక్క రోజులోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా 31,194 పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మాస్కులు ధరించాలని రాష్ట్రాల ఆదేశం
మరోవైపు దేశంలో కరోనా మళ్లీ పడగ విప్పుతుండటం వల్ల కొన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షల బాట పడుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతుండటం వలల్ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన హరియాణా ప్రభుత్వం ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ఆదేశించింది. అటు.. కేరళలోనూ గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పినరయ్ విజయన్ సర్కార్ ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ పుదుచ్చేరి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రులు, హోటళ్లు, మద్యం దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. ఇప్పటికే దేశంలో కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలను అంచనా వేయడానికి సోమ, మంగళవారాల్లో మాక్ డ్రిల్​ చేపట్టాలని స్పష్టం చేసింది

ఇవీ చదవండి :కొత్త లుక్​లో మోదీ.. సఫారీ, టోపీ ధరించి టైగర్​ రిజర్వ్​కు..

దుబాయ్ నుంచి ముంబయికి ముగ్గురు ఉగ్రవాదులు... వరుస పేలుళ్లకు కుట్ర!

Last Updated : Apr 9, 2023, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details