తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. 6 నెలల్లో తొలిసారి ఇలా.. ప్రభుత్వం అలర్ట్

Covid Cases In India : దేశంలో కరోనా వైరస్‌ మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన దిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Covid Cases In India
Covid Cases In India

By

Published : Mar 30, 2023, 11:29 AM IST

Covid Cases In India : దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 3,016 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన దిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

  1. దేశవ్యాప్తంగా కొత్తగా 3,016 కేసులు నమోదయ్యాయి.
  2. గత 6 నెలల్లో అత్యధికంగా కేసుల నమోదు.. గతేడాది అక్టోబర్​ 2న 3,375 కేసులు వచ్చాయి.
  3. కొత్తగా 14 మంది మరణించగా.. అందులో కేరళ నుంచి ఎనిమిది మంది మృతిచెందారు.
  4. ఇప్పటి వరకు కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 5,30,862 కు చేరింది.
  5. గురువారం ఉదయం 8 గంటల వరకు యాక్టివ్ కేసులు 13,509 నమోదయ్యాయి.
  6. డైలీ పాజిటివిటీ రేటు 2.73 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు​ 1.71 శాతానికి చేరింది.
  7. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,47,12,692 మందికి కొవిడ్​ సోకింది.
  8. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,68,321 కాగా.. రికవరి రేట్​ 98.78గా ఉంది.
  9. గురువారం నాటికి 220.65 కోట్ల కొవిడ్​ టీకాల పంపిణీ చేశారు.
  10. దేశ రాజధాని దిల్లీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే కొవిడ్​-19 పరిస్థితిపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ భేటీకి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్​, ఉన్నతాధికారులు, వైద్య సిబ్బంది హాజరు కానున్నారు.
  11. తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దిల్లీలో కరోనా కేసులు 300 దాటాయి. గతేడాది ఆగష్టు తర్వాత ఇదే గరిష్ఠం.. ఆగష్టు 31న అత్యధికంగా 377 కేసులు వచ్చాయి.
  12. మహారాష్ట్రలోనూ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. నాలుగు నెలల క్రితం పాజిటివిటీ రేటు​ 1.05 ఉంది. మార్చి 22- 28 మధ్య ఆ శాతం 6.15కు చేరింది.
  13. సోలాపుర్​ 20.05 శాతంతో తొలి స్థానంలో ఉండగా.. సాంగ్లీ (17.47), కొల్హాపుర్​(15.35), పుణె(12.33), నాశిక్​(7.84), అహ్మద్​నగర్​(7.56) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  14. బుధవారం 230 శాంపిళ్లు పరీక్షించగా.. కొత్త కొవిడ్ వేరియంట్​ XBB.1.16 కేసు నమోదైంది.
  15. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇప్పటి వరకు కనీసం కోటి మంది కూడా బూస్టర్​ డోసులు వేసుకోలేదు. కేవలం 96,56,664 బూస్టర్ డోసులు వేసుకున్నారు. ఇప్పటి వరకు 9,16,70,759 మంది కరోనా తొలి టీకా తీసుకోగా.. 7,66,25,098 రెండో టీకాను పొందారు.

    ఇవీ చదవండి :చనిపోయిన రైతుకు లోన్​.. డబ్బులివ్వకుండానే రుణం కట్టాలంటూ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details