తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2022, 9:55 AM IST

Updated : Jan 7, 2022, 10:45 AM IST

ETV Bharat / bharat

Covid cases in India: దేశంపై కరోనా పంజా- కొత్తగా 1.17 లక్షల మందికి వైరస్​

Covid cases in India: దేశంలో కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 1.17లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్​తో మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారు.

Covid cases in India
Covid cases in India

India covid cases: భారత్​లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో కరోనా.. సునామిలా దూసుకుపోతుంది. రోజు వ్యవధిలోనే రెట్టింపు వేగంతో కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే.. 1,17,100 మందికి వైరస్​ సోకింది. గతేడాది జూన్​ 7 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వైరస్​ ధాటికి మరో 302 మంది చనిపోయారు. 30,836 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 7.74 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 3,52,26,386
  • మొత్తం మరణాలు: 4,83,178
  • యాక్టివ్ కేసులు: 3,71,363
  • మొత్తం కోలుకున్నవారు: 3,43,71,845

ఒమిక్రాన్ వ్యాప్తి..

Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,007డు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 1,199 మంది కోలుకున్నట్లు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దిల్లీలో 465 మందికి కొత్త వేరియంట్​ సోకింది.

రాష్ట్రాలవారిగా ఒమిక్రాన్​ కేసుల వివరాలు

Vaccination in India

దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 94,47,056 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,49,66,81,156కు చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్లు దాటిన కేసులు

corona cases in world: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. గురువారం ఒక్కరోజే నమోదైన.. 24,97,154 కేసులతో.. మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 30 కోట్లు దాటింది. మరో 6,834 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 54,89,717కు చేరింది.

  • అమెరికాలో మరో 7,51,512 మంది కొవిడ్ బారిన పడ్డారు. 2,143 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 8,55,843కి చేరింది.
  • ఫ్రాన్స్​లో తాజాగా 2,61,481 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 204 మంది మరణించారు.
  • బ్రిటన్​లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,79,756 కేసులు వెలుగుచూశాయి.231 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
  • ఇటలీలో తాజాగా 2,19,441 మంది కరోనా సోకింది. 198 చనిపోయారు.
  • టర్కీలో కొత్తగా 68,413 కేసులు బయటపడ్డాయి. 156 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు.

ఇదీ చూడండి:ముంబయిలో ఒక్కరోజే 20 వేలు దాటిన కరోనా కేసులు

Last Updated : Jan 7, 2022, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details