INDIA COVID CASES: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారం రోజు దేశవ్యాప్తంగా 1675 కేసులు నమోదు కాగా.. మంగళవారం 2,124 కేసులు నమోదయ్యాయి. మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 1977 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.46గా నమోదైంది.
- మొత్తం కరోనా కేసులు:43,111,372
- మొత్తం మరణాలు: 5,24,507
- యాక్టివ్ కేసులు: 14,971
- కోలుకున్నవారి సంఖ్య: 4,26,02,714
Vaccination India: దేశవ్యాప్తంగా మంగళవారం 13,27,544 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,92,67,44,769కు చేరింది. ఒక్కరోజే 4,58,924 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 6,21,079 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 1,464 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,87,80,120 కు చేరింది. మరణాల సంఖ్య 63,03,425 కు చేరింది. ఒక్కరోజే 7,57,202 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,91,65,389గా ఉంది.
- అమెరికాలో కొత్తగా 75,633 కేసులు నమోదయ్యాయి. 324 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 54,198 కేసులు వెలుగుచూశాయి. 141 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 42,759 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 68 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 32,820 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 228 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 32,029 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 88 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొరియాపై కొవిడ్ పంజా: ఉత్తర కొరియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా మరో 1,15,980 మంది కరోనా బారినపడగా.. మంగళవారం నాటికి 68 మరణించగా.. కొత్తగా మరణాలు నమోదు కాలేదు. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు 3,064,880 మందికి కరొనా సోకగా.. 27,41,470మంది కోలుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి:దేశంలో 2వేల దిగువకు కరోనా కొత్త కేసులు.. తగ్గిన మరణాలు