INDIA COVID CASES: భారత్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా ఆదివారం 2,022 కేసులు నమోదయ్యాయి. మరో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 2,099 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది.
- మొత్తం కరోనా కేసులు:43,107,573
- మొత్తం మరణాలు: 5,24,459
- యాక్టివ్ కేసులు: 14,832
- కోలుకున్నవారి సంఖ్య: 4,25,99,102
Vaccination India: దేశవ్యాప్తంగా ఆదివారం 8,81,668 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,92,38,45,615కు చేరింది. ఒక్కరోజే 2,94,812 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 4,76,103 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 476 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,74,79,191కు చేరింది. మరణాల సంఖ్య 63,00,257కు చేరింది. ఒక్కరోజే 6,42,980 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,74,80,466గా ఉంది.
- ఆస్ట్రేలియాలో తాజాగా 38,514 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జపాన్లో తాజాగా 34,957 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 19,979 కేసులు నమోదయ్యాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో 19,298 కేసులు వెలుగుచూశాయి. 54 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో కొత్తగా 17,744 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 34 మంది ప్రాణాలు కోల్పోయారు.