తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. మరో 13,216 మందికి వైరస్​ - కొవిడ్​ కేసులు

India Covid cases: భారత్​లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 13,216 మందికి వైరస్​ సోకింది. మరో 23 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్కరోజే 8,148 మంది కోలుకున్నారు.

India cases
India cases

By

Published : Jun 18, 2022, 9:46 AM IST

India Covid Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 13,216 మంది వైరస్​ బారినపడగా.. మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,148 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.63 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.16 శాతం వద్ద ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,32,83,793‬
  • మొత్తం మరణాలు: 5,24,840
  • యాక్టివ్​ కేసులు: 68,108
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,90,845

Vaccination India: భారత్​లో శుక్రవారం 14,99,824 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,00,42,768 కోట్లకు చేరింది. మరో 4,84,924 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 495,865 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,079 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54,30,32,268కు చేరింది. మరణాల సంఖ్య 6,339,375కు చేరింది. ఒక్కరోజే 481,775 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 518,694,841గా ఉంది.

  • అమెరికాలో 81,733కేసులు వెలుగుచూశాయి. మరో 200 మందికిపైగా చనిపోయారు.
  • తైవాన్​లో మరో 55,261 కేసులు.. 154కుపైగా మరణాలు నమోదయ్యాయి.
  • ఫ్రాన్స్​లో 50,605 కేసుల బయటపడగా.. 43 మంది మరణించారు.
  • ఇటలీ ఒక్కరోజే 35,427 మంది కొవిడ్​ బారినపడ్డారు.
  • ఆస్ట్రేలియా​లో 30,187 కరోనా కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చూడండి :'మహా'లో మరో 4వేల కేసులు.. మరణాలపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన!

ABOUT THE AUTHOR

...view details