Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా భారీగా కరోనా కేసులు బయటపడుతున్న మహారాష్ట్రలో కొత్తగా 40,925 కేసులు బయటపడ్డాయి. 14,256 మంది కోలుకోగా 20 మంది మృతిచెందారు. ఒక్క ముంబయిలోనే 20,971 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ముంబయిలోని ధారావిలో కొత్తగా 150 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రాంతంలో యాక్టివ్ కేసుల సంఖ్య 558కి చేరింది.
మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 876కి చేరింది. ఒమిక్రాన్ నుంచి 435 మంది కోలుకున్నారు.
కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్న వేళ దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే వారాంతపు కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 నుంచి ఈ కర్ఫ్యూ అమలు కానుంది. అత్యవసర సేవలు మినహా ఇతరులను 55 గంటల పాటు బయటకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
- నగరంలో కొత్తగా 17,335 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 17.73 శాతానికి పెరిగింది.
- కర్ణాటకలో కొత్తగా 8,449 మంది కరోనా బారిన పడగా.. 505 మంది కోలుకున్నారు. మహమ్మారి ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 30,113గా ఉంది.
వీకెండ్ కర్ఫ్యూలో అమలు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలను నిషేధించింది కర్ణాటక ప్రభుత్వం. శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం 5 వరకు వారాంతపు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
- కేరళలో 5,296 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 35 మంది మృతిచెందగా.. 2,404 మంది వైరస్ను జయించారు. 27,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాల మేరకు మరో 154 మరణాలను జాబితాలో చేర్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మరణాల సంఖ్య 49,305గా ఉంది.
మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 25 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 305కి చేరింది.
- గోవాలో కూడా కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 1,432 కేసులు బయటపడగా.. రెండు మరణాలు నమోదయ్యాయి. 112 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 5,931గా ఉంది.
- బంగాల్లో భారీగా కొవిడ్ కేసులు బయటపడ్డాయి. కొత్తగా 18,213 మందికి కరోనా సోకగా.. 18 మంది మృతిచెందారు. యాక్టివ్ కేసులు 51,384కు చేరాయి.
అసోంలో నైట్ కర్ఫ్యూ..