తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో కొత్తగా 52వేలకుపైగా కరోనా కేసులు.. తగ్గిన మరణాలు - కేరళలో కరోనా

Covid Cases in India: కేరళలో కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 52199 మందికి పాజిటివ్​ అని తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 61,29,755కు చేరింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా భారీగా కేసులు బయటపడ్డాయి.

covid cases in kerala
కేరళలో కరోనా కేసులు

By

Published : Feb 2, 2022, 7:17 PM IST

Updated : Feb 2, 2022, 10:43 PM IST

Covid Cases in India: కరోనా హాట్​స్పాట్​గా మారిన కేరళలో కొత్తగా 52వేలకుగా కేసులు వెలుగుచూశాయి. కొత్తగా 52,199 మందికి వైరస్​ సోకగా.. 500 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మంగళవారంతో పోలిస్తే భారీగా తగ్గింది. కొవిడ్​తో చనిపోయిన వారి సంఖ్య మంగళవారం 1,205గా నమోదైంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 56,100కు చేరింది.

వైరస్​ నుంచి మరో 41,715 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,95,091కు చేరింది. మరోవైపు ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో నమోదైన కొవిడ్​ కేసుల సంఖ్య 61,29,755. వీటిలో 3,77,823 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

  • దిల్లీలో కొత్తగా 3,028 కేసులు నమోదుకాగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రం కొత్త కేసులు మరణాలు
కర్ణాటక 20,505 81
తమిళనాడు 19,280 20
మహారాష్ట్ర 18,067 79
గుజరాత్ 8,934 34
రాజస్థాన్ 8,428 22
మధ్యప్రదేశ్​ 7,359 6
ఆంధ్రప్రదేశ్ 5,983 11
హరియాణా 3,267 17
తెలంగాణ 2,646 3
Last Updated : Feb 2, 2022, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details