తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో కరోనా విలయం- ఒక్కరోజే 55 వేల కేసులు - మహారాష్ట్ర వైరస్

Covid Cases in India: దేశంలో రాష్ట్రాలవారీగా రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కేరళలో కొత్తగా 55 వేలకుపైగా కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. దిల్లీలోనూ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.

Covid cases in India
Covid cases in India

By

Published : Jan 25, 2022, 9:04 PM IST

Updated : Jan 25, 2022, 10:02 PM IST

Covid Cases in India: కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం తగ్గినట్లు కనిపించిన కేసులు.. మంగళవారం రికార్డు స్థాయిలో వెలుగుచూశాయి. ఒక్కరోజే 55,475 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 52,141కు పెరిగింది. కాగా కొత్తగా 30,226 మంది వైరస్​ను జయించారు. దీంతో యాక్టివ్​ కేసుల సంఖ్య 2,85,365కు చేరింది.

మహాలో మళ్లీ..

మహారాష్ట్రలో రోజువారీ కొవిడ్​ కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 33,914 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 86 మంది మరణించారు. 30,500 మంది వైరస్​ను నుంచి కోలుకున్నారు.

కన్నడ నాట తగ్గుదల..

కర్ణాటకలో రోజువారీ కొత్త కేసులు సోమవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. మంగళవారం కొత్తగా 41,400 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 52 మంది మృతి చెందారు. 53,093 మంది వైరస్​ను జయించారు. ప్రస్తుతం 3.50 లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

తమిళనాడులో కొత్త కేసుల సంఖ్య తగ్గింది. తాజాగా 30,055 మందికి వైరస్ సోకింది. మరో 48 మంది మరణించారు. కొత్తగా 25,221 మంది కోలుకున్నారు.

దిల్లీలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 6,028 కేసులు నమోదవగా.. 31 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 10.55 శాతానికి చేరింది.

ముంబయి కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 1,815 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 10 మంది మృతి చెందారు.

కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న మరిన్ని రాష్ట్రాలు..

రాష్ట్రం కొత్త కేసులు మరణాలు
కేరళ 55,475 70
కర్ణాటక 41,400 52
మహారాష్ట్ర 33,914 86
తమిళనాడు 30,055 48
గుజరాత్​ 16,608 28
ఆంధ్రప్రదేశ్ 13,819 12
ఉత్తర్​ప్రదేశ్​ 11,159 17
జమ్ముకశ్మీర్​ 6,570 14
దిల్లీ 6,028 31
ఒడిశా 5,891 07
దిల్లీ 5,760 30
తెలంగాణ 4,559 02
బంగాల్​ 4,546 37
పుదుచ్చేరి 19,11 04

ఇదీ చూడండి:Leopard Attack: చిరుత బీభత్సం- రైతులు, అటవీ సిబ్బందిపై దాడి

Last Updated : Jan 25, 2022, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details