తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో మళ్లీ 50వేలకుపైగా కొత్త కేసులు - దేశంలో కరోనా కేసులు

Covid Cases in India: కేరళలో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 51,887 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజే 1,205 మంది మృతిచెందారు. మరోవైపు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.

Covid Cases in India
కరోనా కేసులు

By

Published : Feb 1, 2022, 6:58 PM IST

Updated : Feb 1, 2022, 9:53 PM IST

Covid Cases in India: కేరళలో మరోసారి 50వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ తగ్గుముఖం పట్టి సోమవారం 42వేల కేసులు నమోదు కాగా.. మంగళవారం ఆ సంఖ్య 51,887కు చేరింది. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కొత్తగా 1,205 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60,77,556కు చేరింది. 56,53,376 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 55,600కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,67,847గా ఉంది.

ఆంక్షల సడలింపు

ముంబయిలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. రాత్రి కర్ఫ్యూను రద్దు చేసి.. రెస్టారెంట్లు, థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతించింది.

వివాహాలను ఫంక్షన్​ హాళ్లలో 25 శాతం సామర్థ్యం లేదా 200 మంది మించకుండా అతిథులతో జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.

మరోవైపు మహారాష్ట్రలో భారీగా కరోనా మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 94 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రం కొత్త కేసులు మరణాలు
తమిళనాడు 16,096 35
మహారాష్ట్ర 14,372 94
కర్ణాటక 14,366 58
గుజరాత్ 8,338 38
ఆంధ్రప్రదేశ్ 6,213 5
తెలంగాణ 2,850 2
దిల్లీ 2,683 27

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి :యూట్యూబ్​లో మోదీనే నెం.1.. సబ్​స్క్రైబర్​లు తగ్గేదేలె..!

Last Updated : Feb 1, 2022, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details