కేరళలో భారీగా తగ్గిన కేసులు.. దిల్లీలో 3శాతం దిగువకు పాజిటివిటీ రేటు
Covid Cases In India: కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 33,538 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ కారణంగా మరో 444 మంది మృతిచెందారు. అటు కర్ణాటకలో కొత్తగా 12,009 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
కేరళలో తగ్గిన కొవిడ్ ఉద్ధృతి
Covid Cases In India: కేరళలో కరోనా విజృంభణ తగ్గింది. కొత్తగా 33,538 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 444 మరణాలు సంభవించాయి. కేరళలో మొత్తం కేసుల సంఖ్య 62,44,654కు చేరింది. శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 46,813 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,52,399 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేరళ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలో కొత్తగా 12,009 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 50 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు.
- మహారాష్ట్రలో కొత్తగా 11,394 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా వల్ల 68 మంది మృతిచెందారు. మరో 21,677 వైరస్ నుంచి కోలుకున్నారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 5,602 మందికి వైరస్ సోకింది. 19 మంది కొవిడ్‌తో మృతిచెందారు.
- దిల్లీలో తాజాగా 1604 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 3శాతం కంటే తక్కువగా చేరింది. దిల్లీలో కొత్తగా 17మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రం | కొత్తకేసులు | మరణాలు |
బిహార్ | 442 | 02 |
హరియాణా | 1,980 | 14 |
ఛత్తీస్‌గఢ్ | 1,764 | 14 |
బంగాల్ | 1,345 | 31 |
తమిళనాడు | 7,524 | 37 |
మిజోరాం | 1,777 | 03 |
గుజరాత్ | 4,710 | 34 |