Covid Cases In India: కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 11,776 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 304 మంది మహమ్మారి కారణంగా మృతిచెందారు. కేరళలో మొత్తం కేసుల సంఖ్య 64,28,148కు చేరింది. కర్ణాటకలోనూ వైరస్ ఉద్ధృతి తగ్గింది. రాష్ట్రంలో తాజాగా 1,405 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 26 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో తగ్గిన కొవిడ్ ఉద్ధృతి.. కర్ణాటకలో పాజిటివిటీ రేటు తగ్గుదల - దిల్లీ కరోనా కేసులు
Covid Cases In India: కేరళలో కొవిడ్-19 ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 11,776 మందికి వైరస్ సోకింది. కర్ణాటకలో తాజాగా 1,405 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 26 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసులు
కొత్తగా 5,762 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కర్ణాటకలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.91గా ఉంది. మరణాల రేటు 1.85గా ఉంది.
ఇతర రాష్ట్రాల్లో కేసులు ఇలా..
రాష్ట్రం | కేసులు | మరణాలు |
దిల్లీ | 756 | 05 |
మహారాష్ట్ర | 2,831 | 35 |
తమిళనాడు | 1,325 | 14 |
మధ్యప్రదేశ్ | 1,222 | 03 |
గుజరాత్ | 998 | 12 |
ఒడిశా | 859 | 22 |
అరుణాచల్ ప్రదేశ్ | 62 | 0 |