Covid Cases In India: కేరళలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 23,253 కేసులు నమోదయ్యాయి. మరో 854 మంది కొవిడ్ కారణంగా మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 63,46,631కి చేరింది. మృతుల సంఖ్య 60,793గా ఉంది. మంగళవారం నుంచి మహమ్మారి నుంచి 47,882 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
దిల్లీలో తాజాగా 1,317 కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో పాజిటివిటీ రేటు 2.11గా ఉంది. దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 18,47,515కు చేరింది. వైరస్‌తో మృతిచెందిన వారి సంఖ్య 26,023కి చేరింది.