కర్ణాటకలో ఒక్కరోజే 50 వేలకుపైగా కరోనా కేసులు - కరోనా వైరస్ అప్డేట్
Covid Cases in India: పలు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కర్ణాటకలో ఒక్కరోజే 50 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. అయితే మహారాష్ట్ర, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది.
Covid Cases in India
By
Published : Jan 23, 2022, 7:42 PM IST
|
Updated : Jan 23, 2022, 10:16 PM IST
Covid Cases in India: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కర్ణాటకలో ఒక్కరోజే 50,210 మంది వైరస్ బారిన పడ్డారు. శనివారంతో పోలిస్తే.. కొత్త కేసులు 7,740 అధికంగా నమోదయ్యాయి. ఫలితంగా పాజిటివిటీ రేటు 22.77 శాతానికి పెరిగింది. వైరస్ ధాటికి 19 మంది చనిపోయారు. 22,842 మంది కోలుకోగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,57,796కు చేరింది.
ఒక్క బెంగళూరులోనే కొత్తగా 26,299 మందికి కరోనా సోకింది. ఫలితంగా నగరంలో క్రియాశీలక కేసుల సంఖ్య 2 లక్షల 31 వేలు దాటింది.
కేరళలో ఉద్ధృతం
కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 45,449 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 56,20,151కి చేరింది. మరో 77 మంది మృతి చెందారు. ఫలితంగా మరణాల సంఖ్య 51,816కు పెరిగింది.
తగ్గిన కేసులు
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 40,805 మందికి పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,93,305కు ఎగబాకింది. వైరస్ ధాటికి మరో 44 మంది మృతి చెందారు. 27,377 మంది కోలుకున్నారు. ముంబయిలోనూ కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
తమిళనాడులో కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 30,580 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,00,954కు చేరింది. మరో 40 మంది మరణించారు.
10 వేల దిగువకు..
దిల్లీలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించింది. తాజాగా 9,197 మందికి వైరస్ సోకింది. దీంతో పాజిటివిటీ రేటు 13.32 శాతానికి తగ్గింది. మరో 34 మంది చనిపోయారు.
జనవరి 13న రికార్డు స్థాయిలో 28,867 కేసులు నమోదవగా.. కేవలం పది రోజుల్లోనే రోజువారీ కేసుల సంఖ్య 10 వేల దిగువకు తగ్గడం ఊరట కలిగించే విషయం.
వివిధ రాష్ట్రాల్లో శనివారం నమోదైన కేసుల వివరాలు..
రాష్ట్రం
కొత్త కేసులు
మరణాలు
కర్ణాటక
50,210
19
మహారాష్ట్ర
40,805
44
తమిళనాడు
30,580
40
గుజరాత్
16,617
19
ఆంధ్రప్రదేశ్
14,440
04
రాజస్థాన్
14,112
19
మధ్యప్రదేశ్
11,253
08
దిల్లీ
9,197
34
ఒడిశా
8,520
06
హరియాణా
7,516
--
బంగాల్
6,980
36
జమ్ముకశ్మీర్
6,253
07
పంజాబ్
5,664
30
ఛత్తీస్‌గఢ్
3,841
11
తెలంగాణ
3,603
01
బిహార్
2,768
02
అసోం
2,277
13
హిమాచల్‌ప్రదేశ్
755
02
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది జమ్ముకశ్మీర్ పాలన యంత్రాంగం. గర్భిణీ, డయాబెటిస్ బాధితులకు విధులకు హాజరవాల్సిన అవసరం లేదని పేర్కొంది.