Corona cases in India: భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో.. 2,09,918 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కారణంగా ఆదివారం మరో 959 మంది మరణించారు. 2,62,628 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:4,13,02,440
- మొత్తం మరణాలు: 4,95,050
- యాక్టివ్ కేసులు:18,31,268
- మొత్తం కోలుకున్నవారు:3,89,76,122
Vaccination in India
భారత్లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం 28,90,986 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 166,03,96,227కు చేరింది.
- ఇప్పటివరకు 166.03 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
- దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,268గా ఉంది.
- మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 4.43శాతంగా ఉంది.
- రోజూవారీ పాజిటివిటీ రేటు- 15.77శాతం
- వారాంతపు పాజిటివిటీ రేటు- 15.75శాతం
- దేశంలో ఇప్పటివరకు 72.89 కోట్ల కరోనా టెస్టులు చేశారు.
- దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు 164.59 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 12.38 కోట్ల డోసులు ఉన్నాయి.