తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఆగని కరోనా ఉద్ధృతి- సాయుధ దళాల్లో వైరస్​ కలకలం - దేశంలో కరోనా కేసులు

Corona Cases in India: కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కొత్తగా 33,470 కేసులు నమోదయ్యాయి. మరోవైపు దిల్లీలో 19,166.. ముంబయిలో 13,648 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి.

covid cases in india
బంగాల్​లో ఆగని కరోనా ఉద్ధృతి

By

Published : Jan 10, 2022, 9:54 PM IST

Corona Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొవిడ్​ హాట్​స్పాట్​గా ఉన్న మహారాష్ట్రలో కొత్తగా 33,470 కేసులు నమోదుకాగా.. 29,671 మంది కోలుకున్నారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 2,06,046గా ఉంది. ముంబయిలో 13,648 కేసులు నమోదయ్యాయి.

  • బంగాల్​లో 19,286 కొత్త కేసులు బయటపడగా.. 16 మరణాలు నమోదయ్యాయి. 8187 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 89,194గా ఉంది.
  • దిల్లీలో కొత్తగా 19,166 కరోనా కేసులు వెలుగుచూశాయి. 14,076 మంది వైరస్​ను జయించగా.. 17 మంది మృతిచెందారు. యాక్టివ్​ కేసులు 65,806కు చేరాయి.
  • కర్ణాటకలో కూడా భారీగా కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 11,698 మందికి పాజిటివ్​ అని నిర్ధరణ కాగా 1,148 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 60,148గా ఉంది.
  • గుజరాత్​లో కొత్తగా 6097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. మరోవైపు, కొత్తగా 28 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 264కు చేరింది.
  • కేరళలో 5,797 కొత్త కేసులు నమోదయ్యాయి. 166 మంది మృతిచెందగా.. 2796 మంది కోలుకున్నారు.

సాయుధ బలగాల్లో వైరస్​ కలకలం..

భద్రత బలగాల్లో కూడా వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్​పీఎఫ్​, బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ, సీఐఎస్​ఎఫ్​, ఎస్​ఎస్​బీ సహా ఎన్​డీఆర్​ఎఫ్​, ఎన్​ఎస్​జీలలో కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం నాటికి 2900కు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. కొత్తగా 618 మంది వైరస్​ బారిన పడ్డారు.

ఇదీ చూడండి :'మోదీ కాన్వాయ్ ఆపింది మేమే'.. సిక్కు వేర్పాటువాదుల ప్రకటన!

ABOUT THE AUTHOR

...view details