Covid cases in India: దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఒక్కరోజే 8,503 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి మరో 624 మంది మరణించారు. తాజాగా 7,678 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 34,674,744
- మొత్తం మరణాలు: 4,74,735
- యాక్టివ్ కేసులు: 94,943
- మొత్తం కోలుకున్నవారు: 3,41,05,066
Vaccination in India:
గురువారం ఒక్కరోజే 74,57,970 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,31,18,87,257 కు చేరినట్లు చెప్పింది.
Coronavirus worldwide:
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజే 6,04,517 మందికి కొవిడ్ సోకింది. మరో 7,093 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,87,40,130కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 53,02,617కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు.. మరణాలు
- అమెరికాలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 1,10,894మందికి కొవిడ్ సొకినట్లు తేలింది. మరో 1,088 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 56,854 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 136 మంది మరణించారు.
- బ్రిటన్‌లో తాజాగా 50,867 మందికి వైరస్ సోకింది. మరో 148 మంది మృతి చెందారు.
- రష్యాలో ఒక్కరోజే 30,209 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,181 చనిపోయారు.
- పోలాండ్‌లో తాజాగా 27,458 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. మరో 562 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 19,696 మందికి కరోనా నిర్ధరణ కాగా.. 195 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో ఒక్కరోజే 16,295 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 78 మంది మరణించారు.
ఇదీ చూడండి:టీకా నిల్వలతోనే కరోనా కొనసాగింపు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక