తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid cases in India: దేశంలో మరో 7,774 కరోనా కేసులు - కరోనా కేసులు

India Covid Cases: దేశంలో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,774 కేసులు వెలుగులోకి వచ్చాయి. 306 మరణాలు సంభవించాయి. శనివారం 89,56,784 మందికి టీకాలు అందించారు.

India covid cases
కరోనా కేసులు

By

Published : Dec 12, 2021, 9:41 AM IST

India Covid cases: దేశంలో కొత్తగా 7,774 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 306 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,464 మంది కోలుకున్నారు.

  • మొత్తం మరణాలు: 4,75,434
  • యాక్టివ్ కేసులు: 92,281
  • కోలుకున్నవారు: 3,41,22,795

Vaccination in India

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. శనివారం 89,56,784 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,32,93,84,230కి చేరింది.

World Covid cases

అటు, ప్రపంచవ్యాప్తంగా 5,03,163 కేసులు వెలుగుచూశాయి. తాజాగా 5,430 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 4,40,695 మంది కోలుకున్నారు. అన్ని దేశాల్లో కలిపి రెండు కోట్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  • అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 57,414 కేసులు బయటపడ్డాయి. 446 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల ఏడు లక్షలు దాటింది.
  • బ్రిటన్​లో కొత్తగా 54,073 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 132 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి ఏడు లక్షలు దాటింది.
  • రష్యాలో వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఒక్కరోజే 1,171 మంది మరణించారు. కొత్తగా 30,288 కేసులు నమోదయ్యాయి.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 53,720 కేసులు వెలుగులోకి వచ్చాయి. 65 మంది కొవిడ్​ బారినపడి మరణించారు.
  • జర్మనీలో వైరస్ విజృంభిస్తోంది. తాజాగా 37,542 మందికి పాజిటివ్​గా తేలింది. 277 మరణాలు సంభవించాయి. 10 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి:

'ఆ జిల్లాల్లో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించండి!'

'ఒమిక్రాన్‌' వేళ.. భారత్‌కు ఊరటనిచ్చే వార్త!

ABOUT THE AUTHOR

...view details