Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం మధ్య 20,557 మంది వైరస్ బారినపడగా.. మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 18,517 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి తగ్గింది.
- మొత్తం కేసులు : 4,38,03,619
- మొత్తం మరణాలు: 5,28,388
- యాక్టివ్ కేసులు: 1,43,091
- కోలుకున్నవారి సంఖ్య: 4,31,32,140
Vaccination India: భారత్‌లో మంగళవారం 26,04,797 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200.61 కోట్లు దాటింది. మరో 4,98,034 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 9,68,111మంది వైరస్ బారినపడగా.. మరో 1,744 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,95,70,280కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,91,609 మంది మరణించారు. ఒక్కరోజే 9,05,601మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,06,81,331కు చేరింది.
- జర్మనీలో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 1,40,999 మందికి వైరస్ సోకింది. 136 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 1,34,188 మందికి కరోనా సోకింది. 144 మంది మరణించారు.
- ఇటలీలో కొత్తగా 1,20,683 మందికి వైరస్ సోకగా.. 176 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 73,537 మందికి వైరస్ సోకగా.. 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆమెరికాలో 75,397 కేసులు నమోదు కాగా.. 299 మంది మరణించారు.
ఇవీ చూడండి :మరో సిపాయిల తిరుగుబాటుకు బాటలు వేసిన 'పిగ్ రూపాయి'
త్రివిధ దళాల్లో 1.35 లక్షల పోస్టులు ఖాళీ.. వెల్లడించిన కేంద్రం