తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగని కరోనా ఉద్ధృతి.. మూడోరోజూ 20 వేలకుపైగా కేసులు - కరోనా వ్యాక్సినేషన్

Covid Cases In India: భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,038 మంది వైరస్​ బారిన పడగా.. 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా 7,76,088 కేసులు బయటపడ్డాయి. బ్రెజిల్​లో ఆందోళనకర స్థాయిలో ఒక్కరోజే 1,07,959 కేసులు వెలుగు చూశాయి.

corona cases in india
కరోనా

By

Published : Jul 16, 2022, 9:42 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 20,044 మంది వైరస్​ బారినపడగా.. మరో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 18,301 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.32 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతంగా ఉంది.

  • మొత్తం కేసులు : 4,37,30,071
  • మొత్తం మరణాలు:5,25,660
  • యాక్టివ్​ కేసులు: 1,40,760
  • కోలుకున్నవారి సంఖ్య: 4,30,63,651

Vaccination India: భారత్​లో శుక్రవారం 22,93,627 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,71,61,438కు చేరింది. మరో 4,17,895 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 7,76,088 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,549 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,62,16,104కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,85,632 మంది మరణించారు. ఒక్కరోజే 5,31,200 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,68,03,187కు చేరింది.

  • బ్రెజిల్​లో 1,07,959 కేసులు నమోదు కాగా.. 299 మంది మరణించారు.
  • జపాన్​లో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 97,339 మందికి వైరస్ సోకింది. 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 96,384 మందికి వైరస్​ సోకగా.. 134 మంది మరణించారు.
  • అమెరికాలో ఒక్కరోజే 94,037 మంది కొవిడ్​ బారినపడగా.. 207 మంది ప్రాణాలు కోల్పోయారు..
  • ఫ్రాన్స్​లో కొత్తగా 23,027 మందికి కరోనా సోకగా.. 108 మంది మరణించారు.

ఇదీ చూడండి :పెళ్లి కోసం సాహసం.. థర్మకోల్​ షీట్​తో వరదలో 7కి.మీ జర్నీ!

ABOUT THE AUTHOR

...view details