Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 19,893 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.94శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 20,419 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి.
- మొత్తం కేసులు : 4,40,19,811
- మొత్తం మరణాలు: 5,26,530
- యాక్టివ్ కేసులు:1,36,478
- కోలుకున్నవారి సంఖ్య:4,34,24,029
Vaccination India:
భారత్‌లో బుధవారం 38,20,676 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205.22 కోట్లు దాటింది. మరో 4,03,006 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు అధికంగానే నమోదయ్యాయి. కొత్తగా 8,29,153 మంది వైరస్ బారినపడగా.. మరో 2,054 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,50,41,290కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,27,389 మంది మరణించారు. ఒక్కరోజే 10,11,506 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,14,32,758కు చేరింది.