Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,464 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 16,112 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది.
- మొత్తం కేసులు : 4,40,36,275
- మొత్తం మరణాలు: 5,26,396
- యాక్టివ్ కేసులు: 1,43,989
- కోలుకున్నవారి సంఖ్య:4,33,65,890
Vaccination India: భారత్‌లో ఆదివారం 8,34,167 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.34 కోట్లు దాటింది. మరో 2,73,888 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,79,258 మంది వైరస్ బారినపడగా.. మరో 816 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,20,96,907కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,19,731 మంది మరణించారు. ఒక్కరోజే 6,55,167 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,21,65,705కు చేరింది.
- జపాన్‌లో 2,12,960కేసులు నమోదు కాగా.. 91 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 73,589 కేసులు నమోదు కాగా.. 20మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో కొత్తగా 36,966మందికి కరోనా సోకింది. 83 మంది బలయ్యారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 31,535 మందికి వైరస్ సోకింది.
- ఆస్ట్రేలియాలో తాజాగా 30,930 మందికి కరోనా సోకింది. 41 మంది మరణించారు.
ఇవీ చదవండి:ముష్కరుల తూటాలకు బెదరని శునకం.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం
ఘోరం.. కరెంట్ షాక్‌తో 10 మంది మృతి.. వ్యాన్‌లోని డీజే సిస్టమ్ వల్లే!