Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 19,406 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 19,928 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి.
- మొత్తం కేసులు : 4,40,59,768
- మొత్తం మరణాలు:5,26,649
- యాక్టివ్ కేసులు:1,34,793
- కోలుకున్నవారి సంఖ్య:4,34,65,552
Vaccination India:
భారత్‌లో శుక్రవారం 32,73,551 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205.92 కోట్లు దాటింది. మరో 3,91,187 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,97,544 మంది వైరస్ బారినపడగా.. మరో 1,953 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,74,35,147కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,33,539 మంది మరణించారు. ఒక్కరోజే 9,39,950 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,80,33,772కు చేరింది.
- జపాన్‌లో 2,53,392కేసులు నమోదు కాగా.. 183 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 1,12,857 కేసులు నమోదు కాగా.. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 89,240 కేసులు నమోదయ్యాయి. 400 మంది మరణించారు.
- ఇటలీలో కొత్తగా 38,215 మందికి కరోనా సోకింది. 175 మంది బలయ్యారు.
- ఆస్ట్రేలియాలో తాజాగా 32,580 మందికి కొవిడ్ సోకగా.. 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి :Precaution Dose: పది కోట్లు దాటిన ప్రికాషన్ డోసుల పంపిణీ
హైటెక్ యుద్ధాలకు భారత్ సన్నద్ధం.. కొత్త వ్యూహాలకు పదును!