Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం మధ్య 18,738 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 18,558 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి.
- మొత్తం కేసులు : 4,40,78,506
- మొత్తం మరణాలు:5,26,689
- యాక్టివ్ కేసులు:1,34,933
- కోలుకున్నవారి సంఖ్య:4,34,84,110
Vaccination India:
భారత్‌లో శనివారం 29,58,617 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 205.21 కోట్లు దాటింది. మరో 3,72,910 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 6,40,086 మంది వైరస్ బారినపడగా.. మరో 1,279 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,87,26,234కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,35,522 మంది మరణించారు. ఒక్కరోజే 8,26,530 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,97,35,275కు చేరింది.
- జపాన్‌లో 2,36,809కేసులు నమోదు కాగా.. 189 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 1,10,610 కేసులు నమోదు కాగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 34,997 కేసులు నమోదయ్యాయి. 158 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 28,518 మందికి కరోనా సోకింది.
- ఆస్ట్రేలియాలో తాజాగా 28,479 మందికి కొవిడ్ సోకగా.. 89 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి :టాటూలు వేసుకున్న ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్.. అదే కారణమా?
పెద్దలసభకు 'సమయం' నేర్పిన నేత.. పారదర్శకతకు పెద్దపీట