Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే 3,500 కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,935 మంది వైరస్ బారినపడగా.. మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి తాజాగా 16,069 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు : 4,37,67,534
- మొత్తం మరణాలు:5,25,760
- యాక్టివ్ కేసులు:1,44,264
- కోలుకున్నవారి సంఖ్య:4,30,97,510
Vaccination India: భారత్‌లో ఆదివారం 4,46,671 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్లు దాటింది. మరో 2,61,470 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,30,140 మంది వైరస్ బారినపడగా.. మరో 628 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,76,43,065కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,87,596 మంది మరణించారు. ఒక్కరోజే 4,42,843 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,86,58,217కు చేరింది.
- జపాన్‌లో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 104,832మందికి వైరస్ సోకింది. 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా73,668 మందికి కరోనా సోకింది.
- ఇటలీలో కొత్తగా 67,817మందికి వైరస్ సోకగా.. 79 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 40,342మందికి వైరస్ సోకగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో 37,899 కేసులు నమోదు కాగా.. 30 మంది మరణించారు.
ఇవీ చూడండి :మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. అయితే రక్తదానం చేయాల్సిందే!
నేటి నుంచే పార్లమెంట్ సమావేశాలు.. అగ్నిపథ్‌పై చర్చకే విపక్షాలు పట్టు!