తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే? - కరోనా వ్యాక్సినేషన్

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 16,866 మంది వైరస్ బారిన పడగా.. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్​లో ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.

covid cases in india
కొవిడ్ కేసులు

By

Published : Jul 25, 2022, 9:31 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,866 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 18,148 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.46 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,39,05,641
  • మొత్తం మరణాలు: 5,26,074
  • యాక్టివ్​ కేసులు: 1,50,877
  • కోలుకున్నవారి సంఖ్య:4,32,28,670

Vaccination India: భారత్​లో ఆదివారం 16,82,390 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 202.17 కోట్లు దాటింది. మరో 2,39,751 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 6,09,038 మంది వైరస్​ బారినపడగా.. మరో 810 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,50,77,968కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,03,113 మంది మరణించారు. ఒక్కరోజే 5,87,040 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,47,34,783కు చేరింది.

  • జపాన్​లో 1,92,109కేసులు నమోదు కాగా.. 53 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 65,433 కేసులు నమోదు కాగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా51,208 మందికి వైరస్​ సోకగా.. 77 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా50,032 మందికి కరోనా సోకింది.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 38,046 మందికి వైరస్​ సోకగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి :'నా కుమార్తెపై ఆరోపణలు ఉపసంహరించుకోవాలి..'.. కాంగ్రెస్​ నేతలకు స్మృతి లీగల్​ నోటీసులు

'నచ్చింది తినలేం, చెప్పాల్సింది చెప్పలేం.. దేశంలో దారుణంగా పరిస్థితులు': ఆళ్వా

ABOUT THE AUTHOR

...view details