కేరళలో తగ్గిన కొవిడ్ కేసులు.. అక్కడ రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
Covid Cases In India: కేరళలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 11,136 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కేసులు తగ్గుతున్నందున జమ్ము కశ్మీర్ రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసింది.
కొవిడ్ కేసులు
By
Published : Feb 13, 2022, 10:43 PM IST
Covid Cases In India: కేరళలో కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 11,136 మందికి వైరస్ సోకింది. కరోనా కారణంగా మరో 146మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,07,383కు చేరింది. మరణాల సంఖ్య 62,199కు చేరింది. కర్ణాటకలో కొత్తగా 2,372 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 27 మంది మహమ్మారి కారణంగా మృతిచెందారు.
కశ్మీర్లో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత..
కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో.. జమ్ము కశ్మీర్ రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసింది. సోమవారం నుంచి దశలవారీగా విద్యాసంస్థలను ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది.
రాజస్థాన్లో కరోనా కేసులు స్వల్పంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్లోని పట్టణ ప్రాంతాల్లో ఐదవ తరగతి వరకు ఫిబ్రవరి16 నుంచి పాఠశాలలు ప్రారభించనున్నట్లు పేర్కొంది రాష్ట్ర సర్కార్. మరోవైపు రాష్ట్రంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ- పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.