కర్ణాటక, ధార్వాడ్‌లోని ఎస్డీఎమ్ వైద్య కళాశాలలో కొవిడ్-19(SDM college covid outbreak) బారిన పడిన విద్యార్థుల సంఖ్య 182 కు చేరింది.
కాలేజీలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్ కె. పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారని వివరించారు. గురువారం మొత్తం 300 మందికి పైగా వైద్యపరీక్షలు నిర్వహించగా.. 66 మంది వైరస్ బారిన(Covid-19 karnataka) పడ్డారన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 182కు చేరినట్లు పేర్కొన్నారు. కొవిడ్ సోకిన వారిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరికొంతమంది విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామన్నారు. ఇప్పటికే క్యాంపస్‌లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేసినట్లు తెలిపారు.