ఉత్తర్‌ప్రదేశ్ వారణాసికి చెందిన ఓ మహిళ కొవిడ్(COVID) సోకిన బిడ్డకు జన్మనిచ్చింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మే 24న ఆ మహిళ చేరింది. కరోనా టెస్టు(Covid test)లో ఆమెకు నెగెటివ్(negative)గా తేలింది. అయితే, మహిళకు పుట్టిన శిశువుకు మే 26న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష(RT-PCR test) నిర్వహించగా.. పాజిటివ్ అని వెల్లడైంది.
కరోనాతోనే జన్మించిన శిశువు- తల్లికి నెగెటివ్
తల్లికి కరోనా లేకున్నా.. పుట్టిన బిడ్డకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. జన్మించిన వెంటనే బిడ్డకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయగా.. వైరస్ నిర్ధరణ అయింది. ఇదో అరుదైన ఘటన అని, ఇరువురికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
కరోనాతోనే జన్మించిన శిశువు- తల్లికి నెగెటివ్
సాధారణంగా శిశువులకు తల్లుల నుంచే కరోనా సోకే ప్రమాదం ఉంటుందని, అయితే ఇది మాత్రం అరుదైన కేసు అని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేకే గుప్తా తెలిపారు. తల్లీబిడ్డలిద్దరికీ మరోసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి-Covid-19: కరోనా చేసిన ఘోరం- బిడ్డలకు తల్లి లాలన దూరం