తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్టోబర్​-నవంబర్​లో కరోనా మూడో ఉద్ధృతి!

కరోనా నిబంధనలను పాటించటంలో విఫలమైతే.. అక్టోబర్​- నవంబర్​ నెలల్లో వైరస్​ మూడో ఉద్ధృతి తారస్థాయికి చేరుతుందని ప్రభుత్వ కమిటీలోని శాస్త్రవేత్త ఒకరు హెచ్చరించారు. ఇమ్యూనిటీ, టీకాల ప్రభావం, కొత్త వైరస్ రకం ఆవిర్భావం... అనే అంశాలు మూడో దశ వ్యాప్తిలో కీలకమైనవిగా పేర్కొన్నారు.

Covid 3rd wave
కరోనా మూడో ఉద్ధృతి

By

Published : Jul 4, 2021, 5:19 AM IST

Updated : Jul 4, 2021, 7:01 AM IST

కొవిడ్ నిబంధనలను సరిగా పాటించకుంటే మన దేశంలో అక్టోబర్-నవంబర్​ నెలల్లో మూడో ఉద్ధృతి పతాక స్థాయికి చేరుకొనే అవకాశం ఉందని ప్రభుత్వ కమిటీలోని శాస్త్రవేత్త ఒకరు హెచ్చరించారు. అయితే, రెండో విడత కరోనా విజృంభణ అత్యధికంగా ఉన్న సమయంలో నమోదైన కేసులతో పోల్చితే ఈ దశలో 50శాతమే ఉండవచ్చని అంచనా వేశారు. తీవ్ర ప్రభావం చూపగల వైరస్ రకమేదైనా కొత్తగా వచ్చినట్లయితే మూడో విడత కరోనా వ్యాప్తి వేగం పుంజుకోవచ్చని తెలిపారు. శాస్త్ర సాంకేతిక విభాగం(డీఎస్​టీ) నియమించిన కమిటీ కొవిడ్-19 వ్యాప్తిపై గణాంకాల 'ఆధారిత సూత్ర నమూనా'ను రూపొందించింది. దీనిలో భాగస్వామి అయిన మణింద్ర అగర్వాల్ మూడో దశ విజృంభణకున్న అవకాశాలను విశ్లేషిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇమ్యూనిటీ, టీకాల ప్రభావం, కొత్త వైరస్ రకం ఆవిర్భావం... అనే అంశాలు మూడో దశ వ్యాప్తిలో కీలకమైనవిగా మణింద్ర అగర్వాల్​ పేర్కొన్నారు. రెండో విడత విజృంభణ ఆగస్టు రెండో వారానికి ముగిసిపోతుందని తెలిపారు. వ్యాధి నిరోధకత తగ్గి, అనుకున్నంత వేగంగా టీకా కార్యక్రమం జరగకపోతే అక్టోబరు-నవంబరులోనే మూడో దశ పతాక స్థాయికి చేరుకుంటుందన్నారు. అయితే, ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండవచ్చని కమిటీలో సభ్యుడు, హైదరాబాద్ ఐఐటీ శాస్త్రవేత్త ఎం.విద్యాసాగర్ అంచనా వేశారు.

Last Updated : Jul 4, 2021, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details