కొవిడ్ వ్యాక్సిన్లు తీవ్ర అనారోగ్యాలు, వైరస్‌తో మరణాలు సంభవించే అవకాశాలను తగ్గిస్తాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ చెప్పారు. టీకా రెండు డోసుల తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతున్న అంశంపై అడిగిన ప్రశ్నపై ఈ మేరకు సమాధానమిచ్చారు.
" ఈ వ్యాక్సిన్లు వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. రెండు డోసులు తీసుకున్న తర్వాత యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. 85 శాతం వరకు ఆసుపత్రిలో చేరకుండా కాపాడగలవు. వ్యాధితో మరణించటం, తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను తగ్గిస్తాయి. "
-బలరామ్ భార్గవ, ఐసీఎమ్ఆర్ డైరెక్టర్