దేశంలోని 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటిన వారిలో ఒకటి కంటే ఎక్కువ జబ్బులతో బాధపడేవారికి టీకాలు వేసే కార్యక్రమానికి కేంద్రం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విభాగాల్లోకి వచ్చేవారు టీకా పొందేందుకు మార్చి ఒకటో తేదీ నుంచి కొవిన్ యాప్‌లో వ్యక్తిగతంగా పేర్లు నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుందని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
మార్చి 1 నుంచి కొవిన్‌లో టీకాలకు పేర్ల నమోదు - కొవిన్ యాప్ తాజా వార్తలు
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తోంది. తాజాగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటిన వారిలో ఒకటి కంటే ఎక్కువ జబ్బులతో బాధపడేవారు టీకా పొందేందుకు మార్చి ఒకటో తేదీ నుంచి కొవిన్ యాప్‌లో వ్యక్తిగతంగా పేర్లు నమోదు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.
మార్చి 1 నుంచి కొవిన్‌లో టీకాలకు పేర్లు నమోదు
టీకాలు వేసేచోట కూడా వీరు పేర్లను నమోదు చేసుకునే వీలుంటుందని చెప్పాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లేదా ఎంపికచేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో రుసుము చెల్లింపుపై వీరికి టీకాలు వేస్తారు.