తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16 లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య - vaccination drive update

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ తొమ్మిదో రోజూ విజయవంతంగా కొనసాగింది. ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 16లక్షల మందికి పైగా టీకా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఒక్క శుక్రవారం రోజే(సాయంత్రం 7.30 గంటల వరకు) 31,466 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్​ ఇచ్చినట్లు వెల్లడించింది.

COVID-19 vaccination: Over 16 lakh beneficiaries inoculated
16 లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య

By

Published : Jan 24, 2021, 10:20 PM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ తొమ్మిదో రోజూ విజయవంతంగా కొనసాగినట్టు కేంద్రం వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 7.30 గంటల వరకు 31,466 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా టీకా అందించినట్లు వెల్లడించింది.

ఇప్పటి వరకు అత్యధికంగా కర్ణాటకలో 1,91,443 మంది టీకా వేయించుకున్నారు. తరువాత ఆంధ్రప్రదేశ్ 1,47,030మంది వ్యాక్సిన్​ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియలో తొమ్మిదోరోజు 10 మందిలో ప్రతికూల ప్రభావం కనిపించినట్టు కేంద్రం తెలిపింది.

ఇదీ చూడండి: 8 రోజుల్లో 15లక్షల మందికి కరోనా టీకా

ABOUT THE AUTHOR

...view details