Covid-19 Vaccination: కరోనాపై పోరులో మానవాళి అమ్ములపొదిలోని తిరుగులేని పాశుపతాస్త్రం- టీకా! ఉప్పెనలా విరుచుకుపడ్డ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను పరిరక్షించేందుకు అనేకమంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు రాత్రింబవళ్లు శ్రమించి నెలల వ్యవధిలోనే అభివృద్ధి చేసిన పలు వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నాయి. కొవిడ్ బారినపడ్డవారిలో తీవ్ర అనారోగ్యం, మరణం ముప్పులను అవి గణనీయంగా తగ్గిస్తున్నాయి. మహమ్మారిపై భారత్ పోరాటంలోనూ వాటిది కీలక పాత్ర. దేశంలో 2021 జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఒక్కరోజులో కోటికి పైగా డోసులు వేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు బూస్టర్ డోసులను అందిస్తుండగా.. భారత్ కూడా ప్రికాషన్ డోసులను వడివడిగా వేస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ మొదలై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా తాజా పరిస్థితులను పరిశీలిస్తే..
ఏ టీకా ఎన్ని దేశాల్లో?