దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోజు వారి కేసులు, పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొంది. మే 10న 24.83 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు మే 22నాటికి 12.45కి చేరిందని తెలిపింది.
ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 15 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉందని స్పష్టం చేశారు. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇంకా 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు.
వ్యాక్సిన్ వృథా సైతం భారీగా తగ్గిందని వీకే పాల్ తెలిపారు. మార్చి 1న 8 శాతంగా ఉన్న కొవిషీల్డ్ టీకా వృథా ప్రస్తుతానికి ఒక శాతంగా ఉందని అన్నారు. కొవాగ్జిన్ టీకా వృథా 17 శాతం నుంచి 4 శాతానికి తగ్గిందని వెల్లడించారు.
వ్యాక్సిన్ పాస్పోర్టు..