ఏప్రిల్లో కొవిడ్ 'సెకండ్ వేవ్' తీవ్ర స్థాయిలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మే చివరి కల్లా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఓ గణితశాస్త్ర నమూనా ఉపయోగించి ఈ అంచనాకు వచ్చారు.
"గత కొన్ని రోజులుగా దేశంలో వైరస్ కేసులు పెరుగుతున్న సరళిని పరిశీలిస్తే.. ఏప్రిల్ 15-20 మధ్యలో కొవిడ్ వ్యాప్తి తీవ్రమవుతుందని తెలుస్తోంది. కానీ, మే చివరికల్లా కేసుల సంఖ్య విపరీతంగా తగ్గే అవకాశాలూ ఎక్కువగానే ఉన్నాయి. కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాం. ప్రస్తుతం రోజువారీగా నమోదయ్యే కేసులు లక్షకు చేరువలో ఉన్నాయి. కానీ, కేసుల సంఖ్య మళ్లీ తగ్గుముఖం పట్టొచ్చు."
--మణీంద్ర అగర్వాల్, ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త.
కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో.. పంజాబ్లో కేసులు విపరీతంగా పెరుగుతాయని, తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.