అత్యవసర వినియోగం కోసం.. ఆక్సిజన్‌కు సంబంధించిన నిల్వలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బఫర్ స్టాక్‌కు సంబంధించిన వివరాలను రాష్ట్రాలను అందించాలని స్పష్టం చేసింది. ఫలితంగా సాధారణ సరఫరాకు ఆటంకం కలిగితే తక్షణమే వీటిని ఉపయోగించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది.
రానున్న నాలుగు రోజుల్లో ఈ అత్యవసర వినియోగానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జస్టిస్ డీవై చంద్రచూద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. రాష్ట్రాలకు ప్రస్తుతమున్న ఆక్సిజన్ కేటాయింపులకు అదనంగా ఇది ఉండాలని స్పష్టం చేసింది.