కొవిడ్ కట్టడి కోసం ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసుల టీకాకు అదనంగా బూస్టర్‌గా మూడో డోసు ఇవ్వాలంటూ ప్రతిపాదనలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై మరింత సమాచారం అవసరమని.. ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు. బూస్టర్ డోస్ ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయంటూ ప్రస్తుతం వస్తున్న ప్రతిపాదనలు.. డేటా ఆధారంగా కాకుండా ఊహాజనితంగా వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
'బూస్టర్ డోసు కోసం మరికొంత కాలం ఆగాల్సిందే' - కరోనా వ్యాక్సిన్ మూడో డోస్
కరోనాను నియంత్రించేందుకు బూస్టర్ డోస్ ప్రతిపాదనలపై ఆరోగ్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో డోసు ఏమేరకు ప్రభావం చూపుతుందన్న అంశమై మరింత సమాచారం అవసరమని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే.. ఫైజర్, మోడెర్నా సంస్థలు తమ టీకా రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోసు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో డోసు ఏమేరకు ప్రభావం చూపుతుందన్న అంశమై మరింత సమాచారం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత.. శరీరంలో యాంటీ బాడీలు ఏస్థాయిలో ఉన్నాయి, ఎంత కాలం తర్వాత యాంటీబాడీలు నిర్ణీత స్థాయి కంటే దిగువకు చేరతాయనే అంశం ఆధారంగా మూడో డోసు అవసరం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
ఇదీ చూడండి:కొవాగ్జిన్ 'మూడో డోసు'కు డీసీజీఐ అనుమతి