తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా నియంత్రణకు సైన్యం సేవలు విస్తరించాలి'

దేశంలో కరోనా విజృంభణ వేళ.. పాలనా యంత్రాంగానికి సహాయం చేయాలని సైన్యానికి సూచించారు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఈ మేరకు సన్నద్ధంగా ఉండాలని ఆ రక్షణ శాఖ ఉన్నతాధికారులు, త్రివిధ దళాల అధిపతులు సహా డీఆర్​డీఓ అధికారులు సూచించారు.

Defence minister Rajnath Singh
రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​

By

Published : Apr 20, 2021, 1:06 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో పాలనా యంత్రాంగానికి సాయం చేయాలని సైన్యానికి సూచించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. సైన్యం తన సేవలను విస్తరించాలన్నారు. సైనిక ఆసుపత్రులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కొవిడ్​ రోగులకు చికిత్స అందించాలని సూచించారు.

కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరిపి.. తగిన సహాయం అందించాలన్నారు. కరోనా నియంత్రణకు తమ వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆ మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు, త్రివిద ధళాల అధిపతులు సహా డీఆర్​డీఓ అధికారులకు సూచించారు.

దీనిపై సైన్యాధిపతి ఎంఎం నరవాణె స్పందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తమకు అవకాశం ఉన్న చోట కొవిడ్​ బాధితులకు చికిత్స అందించే వెసులుబాటు కల్పించడానికి నరవాణె యోచిస్తున్నారని వెల్లడించాయి. అలాగే పాలనా యంత్రాంగానికి అన్నివిధాలా సాయం చేస్తామని చెప్పారని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:మూడో దశ క్లినికల్ ట్రయల్స్​కు జాన్సన్​ దరఖాస్తు

ABOUT THE AUTHOR

...view details